మాతృభాష -తేనెలొలుకు తెలుగుభాష. వి. కృష్ణవేణి

మాతృభాష -తేనెలొలుకు తెలుగుభాష. వి. కృష్ణవేణిమాతృభాష -తేనెలొలుకు తెలుగుభాష

తెలుగుభాష అమ్మ ప్రేమవలే ఎంతో కమ్మనైనది .
తేనెలోలుకు భాష తెలుగుభాష.

చక్కని భావజాలం కలదిగా..
చక్కని పదాల కూర్పుతో
చాకచక్యం చాతుర్యంతో కూడినభాష
తెలుగుభాష.

అర్దవంతంగా మనోభావాలను వ్యక్తమయ్యే భాష తెలుగుభాష.
వీనులవిందు గలభాష పసంథైన భాష
మన తెలుగుభాష.
సుందరమైన, సుమధుర భాష అమ్మభాష
తెలుగుభాష...
మధురాతి మధురమైన భాష మనతెలుగుభాష.

దేశభాషలందు తెలుగు లెస్సా అని
శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన భాషగా..
అష్టదిగ్గజ కవులచే అలరాడించబడిన భాషగా..
నన్నయ్య, ఎఱ్ఱన, పోతన, తిక్కన వంటి ప్రభంద కవులచే అలరించబడి లిఖించబడి చరిత్ర పుటలకెక్కిన భాషగా పేరొంది కీర్తిగడించిన భాష మన తెలుగుభాష..

మన మాతృభాష అయిన తెలుగుభాష తల్లి పాలవంటిదని 
పరభాష దాదిపాలవంటిదని
పరభాషలో భావాలను వ్యక్తీకరించలేమని
మాతృభాషలోనే స్పష్టత ఉంటుందని....
అన్యభాషా ప్రభావంతో మాతృభాషను దూరం చేసుకోకూడదుఅని..
పరభాషా వ్యామోహం వదిలి మాతృభాష అయిన తెలుగు భాషను రక్షించుకోవాలని..
మాతృ భాష అయిన తెలుగుభాష కొరకే అందరూ కృషి చేయాలనీ
తెలుగు భాషను ఇతర భాషలలోను, తెలుగు సంస్కృత భాషలలో విలీనం చేయరాదని పోరాటం చేద్దాం..

వి. కృష్ణవేణి
వాడపాలెం.
తూర్పుగోదావరి జిల్లా

 

0/Post a Comment/Comments