పరోపకారి..!(కవిత)ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

పరోపకారి..!(కవిత)ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

పరోపకారి..!(కవిత)

పూలలోని సుగంధం,
గాలులలోకి వ్యాపించినట్లు
మనిషి మంచితనం కూడ సర్వవ్యాపితం అవుతుంది..!

చెట్ల నిండా ఆకులు,కొమ్మలు,
చల్లని గాలి, నీడ నిచ్చినట్లు 
పుణ్య పురుషులు, 
లోక హితమై వారి జీవితం అంకితం అవుతుంది..!

ఎంత కాదన్నా సముద్రాన్ని సైతం పొగడాలి..!
ఎంత లోతున్నా,అదికాదు విషయం.. మనకి ఉప్పుఅందిస్తోంది..!

ప్రకృతిలో ఇలా ఎన్నెన్నో జీవరాశులు పరోపకారం కోసం ఉద్భవించాయి,
పరోపకారం తో జీవితం ధన్యం అవుతుంది..!

విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments