ముత్యాల హారాలు--గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

ముత్యాల హారాలు--గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

 ముత్యాల హారాలు
----------------------------------
ఓర్పు లేని జీవితము
ఎగసిపడే కాగితము
లేదు అందు ఫలితము
దొరకదోయ్! ప్రతిఫలము

ఉచిత సలహాల కన్న
ఆచరణ కదా మిన్న
అదే కదూ నిజమన్న!
లేనిచో గుండు సున్న

బలహీనతకు లొంగకు
వట్టి దానికి పొంగకు
లేని దానికి క్రుంగకు
వేదన మిగులు చివరకు

చేతనైన సాయము
చేస్తేనే న్యాయము
అసలుసిసలు ధర్మము
దీవించును దైవము

ఖరీదైన కాలము
చేయకోయి వ్యర్థము
చేసుకొనుము అర్ధము
లేకున్న అనర్ధము

--గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
 

0/Post a Comment/Comments