రక్షాబంధన్ శుభాకాంక్షలు డా వి.డి. రాజగోపాల్

రక్షాబంధన్ శుభాకాంక్షలు డా వి.డి. రాజగోపాల్

రక్షాబంధన్ శుభాకాంక్షలు

శ్రావణమాసం వచ్చింది
పున్నమి చంద్రుడు నిండుగా
ఆకాశంలో అలరించ వచ్చాడు
ఈ వెన్నెల మామూలు వెన్నెల కాదు
ఓ అన్నయ్య పై ఆప్యాయత
ఓ తమ్మయ్య పై అనురాగం
తెచ్చే నిండైన వెండి వెన్నెల
ఆ వెన్నెల్లో ఓ అక్కయ్య అనురాగం
ఓ చెల్లెమ్మ ఆప్యాయత 
మణికట్టుకు తొడిగే రక్షణాబంధం

ఆ బంధం మమతానురాగాల
అమృతాన్ని నిత్యం ఒడిసి పట్టి
ఓ ముంతలో నింపి
ఆ మమతల ముంతలో అద్దింది సుమా!

తోబుట్టువుల బంధం రక్త సంబంధం
ఆ రక్తంలో ఓ భాగం
పెరిగి ఎదిగి మరోపంచన
ఓ ఇల్లాలై వెళ్తుంది ఓ అందాల భరణి
మనసులో భర్త తలపులతో
మెట్టినింటి సంసార భారంతో
సతమతమవుతూ
గుండెల్లో దాచుకునే ప్రేమ
అమ్మ నాన్న అన్న తమ్ముడు
ఏడాదికొకమారు పంచుకోనే
పండుగకు మరో పేరు రాఖి
రక్షాబంధన్ అన్నా అదే

ద్రౌపది శ్రీకృష్ణునివేలికి గాయమైతే
తన చీరకొంగు చింపి  కట్టడం
ఆమె తన వస్త్రాపహరణ సందర్భంగా
శ్రీకృష్ణుడు రక్షాకవచమై కాపాడటం
ఈ రక్షాబంధానికి నాంది పలికింది

విష్ణుమూర్తి బలిచక్రవర్తి
భక్తికి బంధీయై లక్ష్మీదేవికి దూరమవటం
లక్ష్మీదేవి బలిచక్రవర్తిని
ఈ రక్షాబంధన్ తో బంధించగా
సోదర ప్రేమకు ముగ్ధుడై విష్ణుమూర్తిని
వదలి పెట్టినట్టు 

తక్షశిల రాజు పురుషోత్తమునిపై
అలెగ్జాండర్ దండయాత్ర చేసినట్టు
ఓటమిని ఊహించుకున్న
అలెగ్జాండర్ భార్య రుక్సాన
ముందే పురుషోత్తముని రాఖీతో
బంధించి భర్తను రక్షించు కొనటం
మన చరిత్ర చెప్పిన సత్యం
చూశారా రాఖీ మహిమ ఓ మహిళకు
మాంగల్యం బలమైంది

చూశారా పైన చెప్పిన వారు
రక్తబంధీకులు కాదు
అయినా సోదర ప్రేమకు బంధంమై
రక్షణ పొందిన వారే సుమా!

సోదరీమణుల సౌభాగ్యం కోసం
పరితపించే సోదరులు
సోదరప్రేమకు పరితపించే
ఆడపడుచులకు
ఈ రాఖీ రక్షాబంధమై
ఒకరి కోసం మరొకరు
తాపత్రయ పడే ఓ పవిత్ర బంధం
అని ఓ మారు గుర్తు చేసే
రాఖీ పండుగ నేడు
కరోనా నేపథ్యంలో
చక్కని అక్షర బంధంతో
మీ వాట్స్అప్నే  సాధనంగా
జరుపుకుందాం రక్షాబంధాన్ని

డా వి.డి. రాజగోపాల్
9505690690 


0/Post a Comment/Comments