🌺 ప్రవాహిని - అంతర్జాల సాహితీ పత్రిక 🌺 మాతృభాషా దినోత్సవ సందర్భంగా - "భాషామృతం" --విస్సాప్రగడ పద్మావతి, హైదరాబాద్

🌺 ప్రవాహిని - అంతర్జాల సాహితీ పత్రిక 🌺 మాతృభాషా దినోత్సవ సందర్భంగా - "భాషామృతం" --విస్సాప్రగడ పద్మావతి, హైదరాబాద్


🌸ప్రవాహిని సాహిత్య వేదిక🌸


అంశం __ మాతృ భాష _ పునరుద్ధరణ


శీర్షిక ___

మాతృభాష మకరందం 

భావితరాలకు అందిద్ధాం 



అమ్మ జోల పాట 

కమ్మనైన లాలి పాట

మాతృమూర్తి ఒడిలో 

ఓనమాలు దిద్ది

మొదటగా నేర్చే భాష

మన తెలుగు భాష


భరతమాత మోమున 

మెరిసిన తిలకంలా

తేనె మధురిమ సారంలా

కోకిల గాన స్వరంలా

వేణు నాద వినోదములా

పురివిప్పి నాట్యమాడే 

అందాల మయూరంలా

మధురమైన భాష

మన మాతృభాష


తెలుగును చులకన చేసి

ఆంగ్లం పై మక్కువ చూపి

ఆంగ్ల భాష ప్రాధాన్యతను పెంచి

తెలుగుభాష ఉనికి 

దూరమయ్యే ఈ తరుణంలో


పరవళ్ళు తొక్కే గోదావరిలా

ఉరకలు వేసే తరంగిణిలా

ఎన్నో నుడికారాలతో 

మరెన్నో అలంకారాలతో

శోభాయమానంగా వెలుగొందే

తెలుగుకు స్వస్తి చెప్పి

ఇతర భాషలకు ప్రాధాన్యమిచ్చి

తెలుగు వారమై తెలుగులో 

భాషించుటకు సిగ్గుపడీ

అన్యభాషల పై ఆత్రుతతో 

మాతృభాషను మరచి

ఎటు పోతున్నామో తెలియక 

తూర్పు వెళ్ళే రైలులా

చుక్కాని లేని నావలా

ప్రయాణం సాగుతుంటే

 

నేను సైతం

వెలుగు చుక్కనై

మాతృభాష అభివృద్ధికై

ప్రజల్లో చైతన్యం నింపి

సర్వదా పాటుపడతా


ప్రపంచ భాష లందు తెలుగు లెస్స 

అని చాటి చెబుతా

మాతృభాష మకరందం

భావితరాలకు ఆనందం 

అనే స్ఫూర్తిని నింపి

తెలుగు భాష రుచి చవి చూపి

మాతృ భాష ఋణం

కొంతైనా తీర్చుకోడానికి

అహరహము కృషి చేస్తాను.


మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


హామీ పత్రం

ఈ కవిత నా స్వీయ రచన అనుకరణ కాదు.


విస్సాప్రగడ పద్మావతి

హైదరాబాద్

0/Post a Comment/Comments