రక్షా బంధన్ రోజున అన్న తమ్ముల బంధానికి దురమైన అన్న బాధ...

రక్షా బంధన్ రోజున అన్న తమ్ముల బంధానికి దురమైన అన్న బాధ...

రక్షా బంధన్ రోజున అన్న తమ్ముల బంధానికి దురమైన అన్న బాధ... 


 *తమ్ముడు శివను యాది చేసుకుంటూ* ..

           జీవితం అంటేనే "కష్ట సుఖాల ప్రయాణం".  బాధ, సంతోషం ఒకదాని కొకటి మన వెంటే వస్తూ పోతుంటాయి.   

             ఏప్రిల్ 11, 2019 వ నాడు మా కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆ బాధాతప్త విషాదకర సంఘటన ప్రభావం మా అమ్మ  నాన్నల మీద బాగా పడింది. ఎంతైనా చిన్న కొడుకు కదా! సహాజంగానే ప్రతి తల్లికి ప్రేమ ఎక్కువే ఉంటుంది. అమ్మ తమ్ముని తలుచుకుని ప్రతి రోజు ఏడుస్తూనే ఉండిపోయింది. ఆమెను ఓదార్చలేక  ఇంట్లో గోడకున్నా ఫోటో తీసి లోపల పెట్టగలిగాము, కాని అమ్మ హృదయం లోంచి వాడి జ్ఞాపకాలను ఎలా దూరం చేయగలం. 

         కుటుంబ పెద్ద కొడుకుగా పైకి ధైర్యంగా కనిపించటానికి నన్ను నేను చాలా రకాల పనుల్లో నిమగ్నం చేసుకున్నాను. ఉద్యోగ బాధ్యతలలో  , పుస్తక పఠనం మెుదలైన వాటిలో తీరిక లేకుండా చేసుకోవడం ద్వారా ఎక్కడా నా బాధను కనిపించనీయలేదు. కాని ఎందుకో ఈ రోజు తమ్ముడి మరణం గుర్తుకు రాగానే తెలియకుండా కన్నీళ్లు ఆగలేదు. 

       బాధను ఎంతటి వారైనా దాచలేరేమో కదా!!!  గాంధీ ఆసుపత్రిలో పోస్టు- మార్టం కోసం బల్ల మీద పడుకోబెట్టిన తమ్ముడి పార్దివ దేహం కళ్ల ముందు కదిలే సరికి కన్నీళ్లు ఆగలేదు. 

       ఒక్క వ్యక్తి మరణం ఎంత మందిని విషాదంలోకి నెట్టివేసింది. ఎన్ని జీవితాలకు తీరని వ్యథ మిగిల్చింది. తప్పు ఎవరిదైనా శిక్ష కుటుంబంలో నమ్ముకుని ఉన్నవాళ్లే అనుభవించాలి కదా! 

           చిన్నప్పటి నుంచి ఆటలలో మరియు పొలం పనులలో చాలా మేటిగా ఉండేవాడు. నాకన్నా వాడికే మిత్రబృందం ఎక్కువ. పదవ తరగతి తర్వాత వాడికిష్టమైన మెకానిక్ పనులలో ప్రావిణ్యం.. సంపాదించి . టెక్నాలజి కూడా ఉపయోగించుకొని.. కుటుంబ పోషణంలో తను  కూడా చేదోడుగా ఉందామని వస్తున్న క్రమంలో .. 

ఏ నరుని కన్ను పడిందో.. లేక ఆ దేవుడు కండ్లు మూసుకున్నాడో.. దురదృష్టవశాత్తు జరిగిన యాక్సిడెంట్లో  మూడు రోజులు మృతువుతో పోరాడి.. హాస్పిటల్లో  నా చేతిలో తమ్ముడు తుదిశ్వాస విడిచిన క్షణం ఇప్పటికి.. కండ్లముందే ఉంది.

         మరు జన్మ ఉన్నదో లేదో కాని 'మరు పన్నదే ' లేక పోతే మనుషుల జీవితం మనశ్శాంతి లేక అల్ల కల్లోలం అయ్యేది. ఎన్నాళ్లయినా కొన్ని విషాద సంఘటనల తాలుకు జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ మనల్ని పరీక్ష పెడుతూనే ఉంటాయి. ప్రతి జీవిత పరీక్షను అధిగమిస్తూ ముందుకు వెళ్లగలగడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి.

తమ్ముడి  యాదిలో....
మీ అన్నయ్య...
మట్టపల్లి రమేష్.
మాడ్గుల..
9490807729

0/Post a Comment/Comments