అసామాన్యుడు అబ్దుల్ కలామ్ --తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (టీచర్)

అసామాన్యుడు అబ్దుల్ కలామ్ --తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (టీచర్)

సాధారణ కుటుంబంలో జన్మించిన అసమాన ప్రతిభాశాలి\

అణ్వస్త్ర పితామహుడు,నిష్కళంక సేవాతత్పరుడు, 

నిరాడంబరుడు, నిగర్వి మన అబ్దుల్ కలాం

ఆయన మేధస్సులో మెరిసిన ఆలోచనలు

భారత అంతరిక్షంలో విరిసిన విజ్ఞాన చంద్రికలు

అణ్వస్త్ర పితామహుడు, క్షిపణి శాస్త్రవేత్త

పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్ వరకు

రామేశ్వరం నుండి రాజధాని వరకు

పదవులకే వన్నెతెచ్చిన భారతరత్నం

విజయం ఎప్పుడూ తొలి అడుగు మాత్రమే గమ్యం కాదు

ఓటమి పాఠాలు విజయానికి బాటలు అంటూ

యువతలో స్ఫూర్తి నింపిన మార్గదర్శి

కలలు కనడం కాదు ఆ కలల్ని నిజం చేసుకొని

సంతకం ఆటోగ్రాఫ్ గా మారడమే విజయమని

విద్యార్థి లోకానికి ఉద్భోధించిన స్ఫూర్తి శిఖరం

చెరగని చిరునవ్వు ఆయన ఆభరణం

భరతావని సిగలో నీ స్థానం అపురూపం


        తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (టీచర్)
              రాజన్న సిరిసిల్ల జిల్లా0/Post a Comment/Comments