ప్రక్రియ:సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
౧
ఛందస్సుల సంకెళ్లు తెంచినాడు
వ్యావహారికభాషను వాడుకలోకి తెచ్చినాడు
సవరభాషకు లిపి సమకూర్చినాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
౨
నండూరివారి ఎంకి పాట
చిలకమర్తివారి హాస్యపు మాట
గిడుగువారి వ్యావహారిక బాట
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
౩
అమ్మపాలలా కమ్మనైన భాష
పొరుగురాజులు మెచ్చిన మెరుగుభాష
ఆశుకవిత్వాల అవధానాల మేటిభాష
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
౪
శతకాలతో మకుటాయమానమైన భాష
విదుషీమణులు వన్నెలద్దిన భాష
కవనామృతాలు చిలకరించిన భాష
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
౫
పరాయిభాషను అవసరమైనమేరకే వాడుకొందాం
మన మాతృభాషలో మాట్లాడుకొందాం
మన ఉనికిని కాపాడుకొందాం
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
****************************************
చంద్రకళ. దీకొండ,
మేడ్చల్-మల్కాజిగిరి
చరవాణి:9381361384