అనుబంధ ఆత్మీయతకు ప్రతీక. --వి. కృష్ణవేణి, వాడపాలెం. తూర్పుగోదావరి జిల్లా.

అనుబంధ ఆత్మీయతకు ప్రతీక. --వి. కృష్ణవేణి, వాడపాలెం. తూర్పుగోదావరి జిల్లా.


శీర్షిక :అనుబంధ ఆత్మీయతకు ప్రతీక.
ప్రక్రియ :వచనకవిత.

అన్నా చెల్లెళ్ల,అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.

అమ్మానాన్నలతో సమాన ప్రేమను పంచే 
సోదరులకు విజయం కలగాలని ఆకాంక్షిస్తూ
కట్టేదే రక్షా బంధన్..

శ్రావణమాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున వచ్చే పవిత్ర పర్వదినం
రాఖీ పౌర్ణిమ..

దీనినే  శ్రావణ పౌర్ణిమ, రక్షణ పౌర్ణిమ, నారికేలా పౌర్ణిమ, జంద్యాల పౌర్ణిమగా, నారి పౌర్ణిమగా, సారధి పౌర్ణమిగా ఇలా 
ఎన్నో రకాలుగా ప్రజలు ఆనందోత్సహంగా ఉత్సవాలు జరుపుకునే రోజుగా..

దేవతలు, ప్రకృతి ఆరాధన, ఆత్మీయ అనుబంధాలు వెళ్లువిరిసే రోజుగా..

సంస్కృతీ సాంప్రదాయాలకు నిలువెత్తు ఆదర్శంగా..
అనురాగం, ఆత్మీయతకు ప్రతీకై!

తోబుట్టువులకు ఒకరికొకరు నీనున్నానే థైర్యాన్ని చాటుకునే ప్రాముఖ్యతగల రోజుగా.

అన్నయ్య కలలు పండాలని, చెల్లాయి మనసు నిండాలని కోరుకునేదే స్వచ్ఛమైన రక్షా బంధన్ కే సాధ్యమంటూ చాటుకునే రోజుగా..

సాంప్రదాయ పండుగలలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంటూ..

నా అన్నవాళ్ళు లేకపోయినా అమితంగా అనురాగాలను పంచుకుని స్త్రీపురుషుల మధ్యకూడా రక్షా బంధన్ పవిత్రతను చాటుకునేదే  రక్షా బంధన్ .

సోదరుని జీవితం సౌభాగ్యాలతో,
ఆయురారోగ్యాలతో, తులతూగాలని మనస్ఫూర్తిగా థైవాన్ని స్మరిస్తూ కట్టే రాఖీ రక్షబంధన్ ..

 రక్షా బంధన్ చారిత్రక విశిష్టత ను సంతరించుకుని..
ఈ రక్షబందన్ తో 
సంవత్సరమంతా ద్రుష్ట, ప్రేత, పిశాచ, బాధ ఉండదని...
అనారోగ్య, అశుభాన్ని పోగొడుతుందని చెబుతూ..
మహాభారతకథలలో రక్షాబంధన్ ప్రసక్తి కనబడును..

వి. కృష్ణవేణి
వాడపాలెం.
తూర్పుగోదావరి జిల్లా
9030226222.

ప్రక్రియ :వచన.
 
 

0/Post a Comment/Comments