మన తెలుగు -- వల్లంభట్ల వనజ, అదిలాబాద్.

మన తెలుగు -- వల్లంభట్ల వనజ, అదిలాబాద్.
************
మన తెలుగు
***********

జుంటి తేనెల కన్న
జున్ను ముక్కలకన్న
మధుర మధురమైన 
మాతృ భాషే మిన్న

పాల మీగడల కన్న
పాయసాన్నముకన్న
మధుర మధుర మైన 
నా తెలుగు భాష మిన్న

చిలకమ్మ పలుకులు
రాయంచ నడకలు
తేనె లోని మధురిమలు
తెలుగులో వెలుగులు

వాసంత  సమీరంల
కోకిలమ్మ గానంల
పరవశింప జేయు
జాను తెనుగులోఝరిల

సంధి సమాసముల
సౌందర్య రాశిల
అలంకారములనెడి
అమూల్య నిధుల

రసములు రమ్యమై
రంజిల్లు  రీతులై
పద్య గద్య వచన
వ్యాసపు యుక్తమై

కమనీయ మైన భాష
కవులు మెచ్చిన భాష
కలికి తన మెల్ల నిండిన 
అద్భుత మగు కావ్య భాష

అందమైన భాష  తెలుగు
అమృత భాష తెలుగు
అద్వితీయ భాష తెలుగు
అజంతా భాష తెలుగు

             ✍🏻 వల్లంభట్ల వనజ
                    అదిలాబాద్

0/Post a Comment/Comments