శాస్త్రవేత్తలు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

శాస్త్రవేత్తలు..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

శాస్త్రవేత్తలు..!(కవిత)
********✍🏻విన్నర్*******
గొప్ప వ్యక్తులు వారు,
ఎవరైతే ఈ జగత్తు కి సకల సౌకర్యాలు అందించారో..!
ఎన్నెన్నో ఆవిష్కరణలు
ఎన్నెన్నో పరిశోధనలు
ఎన్నెన్నో కొత్త సౌకర్యాలు
జనహితులై వర్ధిల్లారు..!

ఎన్నో రాత్రులు పోగొట్టుకున్నారు
ఎన్నో రోజులు 
కడుపు మాడ్చారు
ఎన్నో ఇబ్బందులు 
ఎదుర్కొన్నారు..
ఐనా.. 
కొత్త విషయాలు కనుగొని ,
మానవ జాతికి మేలు చేశారు..!
అందరి మనస్సుల్లో 
ఎల్లప్పటికై జీవిస్తున్నారు..!

మానవ జాతి మనుగడ లో మైలు రాయి వారు..!
శాస్త్రవేత్తల రూపం లో మహనీయులు..!
ఏ కొత్త వస్తువుని చూసినా వారే.. 
ముందు గుర్తుకొస్తారు..!
వాళ్ళే గనుక లేకపోతే 
నేడు పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు..!??
ప్రణామములు వారికి..ఎనలేని..!!🙏🙏

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,
నాగర్ కర్నూల్ జిల్లా,
తెలంగాణ.

0/Post a Comment/Comments