అందము విలువలు
-----------------------------
ముద్దులొలుకు బాలలు
పాఠశాలకందము
విరబూసిన పూవులు
వనమెల్లా అందము
కిలకిల చిరునవ్వులు
వదనములో అందము
పసి పిల్లలు పలుకులు
తేనె వోలె మధురము
బ్రతుకులోన విలువలు
భవితకు ఇల వెలుగులు
సాటిలేని చదువులు
వెలిగించును బ్రతుకులు
ప్రేమ చిందు మనసులు
పాలకడలి తరగలు
జాబిలమ్మ సొగసులు
మేలి పసిమి ఛాయలు
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.