జీవనాదారిణి ---వి. కృష్ణవేణి

జీవనాదారిణి ---వి. కృష్ణవేణి


జీవనాదారిణి

వర్షపునీరు కలయికతో..
ఎత్తు అయిన పర్వతాలలో .
మంచు కరిగిన నీటితో..
చిన్న చిన్న పాయలుగా
ప్రవహిస్తూ ఒకదానికొకటి
ఏకమై పెద్ద ప్రవాహంగా మారుతూ  
నదిజలాశయమై..

వాగు వంకై ప్రవహిస్తూ..
సకల ప్రాణులకు
జీవనధారామయ్యెను..


నది తీరాలు
ఎన్నో  పుణ్యక్షేత్రాలు వెలసి
సంస్కృతి సంప్రదాయాలకు
నిలయాలు.

నదులు నాగరికతకు
అద్దం పట్టెను జీవనాడిగా..

నదులు ప్రజలకూ ఆధారంగా
వ్యవసాయానికి ఊపిరిగా
ప్రకృతికి ఆహ్లాదంగా.

పాపాలు పోగొట్టే
పుష్కర సంఘమం.
ఎన్నెన్నో డ్యాముల నిలయం.
ప్రాంత ప్రాంతాలకు అడ్డుకట్టగా
దేశవిదేశాలకు ఆనకట్టగా
 వెలిసెను భువినందు.

కృష్ణ, యమున, తుంగభద్ర, గోదారి 
ఎన్నెన్నో పుష్కరాలకు పుణ్యతీర్థమై వెలిసెను.
జీవకోటికి దాహర్తిగా ఉంటూ
సకల జీవాలకు ఆధారిణి.

---వి. కృష్ణవేణి
వాడపాలెం
తూర్పుగోదావరి జిల్లా.
9030226222


0/Post a Comment/Comments