మంచి యన్నది..!(కవిత),ముహమ్మద్ ముస్త ఖీమ్ విన్నర్

మంచి యన్నది..!(కవిత),ముహమ్మద్ ముస్త ఖీమ్ విన్నర్

మంచి యన్నది..!(కవిత)
*******✍🏻విన్నర్*******

ఆనందం మంచి విషయాల్లో వెతకాలి..!
చెడులో పొందేది తాత్కాలికం మరియూ పాపాత్మకం..!
మనం చేసే మంచి
పనుల్లో ఆనందం 
నీడలా వెన్నంటి ఉంటుంది..!
అందుకే, 
మంచిపనులు చేయడం కై కంకణం కట్టుకొని.. ముందుకెళ్లాలి..!
మంచి పనులు పుణ్యకార్యాలు అనబడతాయి..!
దేవుని అనుగ్రహానికి కారణభూతాలవుతాయి..!
మన జీవితంలో 
మంచి జరగాలని కోరుకుంటే..
మంచికి దగ్గరలో ,
చెడుకు ఆమడ దూరంలో, ఉండడం నేర్చుకోవాలి..!
పువ్వును ప్రేమిస్తే.. 
పరిమళం అందుతుంది..ఇది మంచి,
ముల్లును అభిమానిస్తే గుచ్చి రక్తం చూపుతుంది..ఇది చెడు.,
అందుకే ఎన్ని రకాలుగా చూసినా మంచికే, 
మొదటి స్థానం..!
ఒక్కొక్కసారి మంచికి పరాభవం ఎదురైనా..
అంతిమంగా దానిదే విజయకేతనం..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments