ప్రశ్నిస్తేనే ప్రతిఘటిస్తేనే ప్రగతి... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ప్రశ్నిస్తేనే ప్రతిఘటిస్తేనే ప్రగతి... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ప్రశ్నిస్తేనే ప్రతిఘటిస్తేనే ప్రగతి...

ఈ జీవితం చాలా చిన్నదండి...
దీన్ని నాలుగు భాగాలుగా చేసుకోండి

ఒక భాగం మీ కోసమండి
ఒక భాగం సమాజం కోసమండి
ఒక భాగం కుటుంబం కోసమండి
ఒక భాగం ఆ భగవంతుని కోసమండి

బద్దకం వద్దండి మొద్దునిద్దుర పోకండి
మంచానికి కంచానికి అతుక్కుపోకండి
ప్రతినిత్యం ఆ భగవంతున్ని స్మరించండి
ప్రతి నరునిలో ఆ దైవాన్ని దర్శించుకోండి

సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోండి
రేపు ఏమిజరుగునో ఎవరికీ తెలియదండి
మంచిని మానవత్వాన్ని పదిమందికి పంచండి
మోసాన్ని ఖండించండి ప్రశ్నించడం నేర్చుకోండి

పక్కాగా ఆర్థిక ప్రణాళికలు రచించుకోండి
ఆరోగ్యంగా హాయిగా ఆనందంగా వుండండి
పరులకు ఆదుకోండి ప్రశాంతంగా జీవించండి

ఆపై ఇక మీ ఇష్టదైవంలో ఐక్యమై పొండి
ఉత్కృష్టమైన ఈ మానవజన్మ,మళ్ళీమళ్ళీ 
తిరిగిరాదని మాత్రం ప్రతిక్షణం గుర్తుంచుకోండి.

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్ - 9110784502

0/Post a Comment/Comments