చిరస్మరనీయుడు బోస్ (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

చిరస్మరనీయుడు బోస్ (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)


చిరస్మరనీయుడు బోస్

జానకి నాథ్ బోస్ ప్రభావతి ల తనయుడు
ఒడిశా కటక్ వాస్తవ్యుడు
అనిత కు జనకుడు
నేతాజీ బిరుదాంకితుడు

సివిల్స్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన మేధావి
ఆంగ్లేయుల గుండెల్లో నిదురించిన ధీరుడు
భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన దేశభక్తుడు
మరపురాని మరువలేని మహోన్నతుడు

స్వాతంత్ర్య సమరయోధుడు బోస్
సాయుధపోరాటమే ఆయుధం గల బోస్
భారత జాతీయ సైన్యాధినేత బోస్
ఫార్వర్డ్ బ్లాక్ స్థాపకుడు బోస్

ఆజాద్ హిందుఫౌజ్ స్థాపకుడు
2సార్లు భారత కాంగ్రెస్ అద్యక్షుడు
ఆజాద్ హిందూ ఫౌజ్ రేడియో వ్యవస్థాపకుడు
11సార్లు బ్రిటిష్ చే జైలుకు పంపబడిన దేశభక్తుడు
ధీరత్వము వీరత్వం కలిగిన స్వాతంత్ర్య సమరయోధుడు 

గాంధీ మితవాది బోస్ అతివాది
గాంధీకి వ్యతిరేకం గా పట్టాభి గారిని ఓడించెను
జాతీయప్రణాళిక కమిటీ ఏర్పరచెను
స్వతంత్ర్యమే లక్ష్య సాధనంగా పోరాడేను

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ జర్మన్ రష్యా పర్యటన
ఖైదీలు కూలీలతో సైన్యకూటమి ఏర్పాటు
దీర్ఘకాలిక దూరాలోచన ప్రణాళిక వేసేను

సి.ఆర్.దాస్ తో ఉద్యమాన్ని ప్రారంభించేను
2వప్రపంచ యుద్ధాన్ని ఆసరా చేసుకొనేను
హిట్లర్ ను కూడా కలుసుకొనెను
మంచి సమయం లో కనుమరుగైన 
చిరస్మరనీయుడు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
           సాలూరు టీచర్
           విజయనగరం జిల్లా
           9441530829


0/Post a Comment/Comments