జయహో జయహో స్వతంత్ర భారతమా...! _ కొంపెల్లి రామయ్య ( యామిని తేజశ్రీ) ఖమ్మం

జయహో జయహో స్వతంత్ర భారతమా...! _ కొంపెల్లి రామయ్య ( యామిని తేజశ్రీ) ఖమ్మంజయహో జయహో స్వతంత్ర భారతమా...!

_ కొంపెల్లి రామయ్య ( యామిని తేజశ్రీ) ఖమ్మం
చరవాణి:7032504646


పల్లవి:
జయహో జయహో స్వతంత్ర భారతమా
జయ జయ జయహో స్వతంత్ర  భారతమా
అంబరమున సంబరమై ఎగిరే త్రివర్ణ పతాకమా
స్వేచ్ఛా వాయువులో విహరించే  శాంతి కపోతమా 
// జయహో//

చరణం:1
గాంధీజీ కలలు కన్న ఘన భారత దేశమా 
నెహ్రూజీ నేర్పిన మానవతల మణి హారమా
ఆజాద్ హింద్ ఫౌజ్ నేతాజీ  సమర నాదమా
మన్యం వీరుడు అల్లూరి నేలకొరిగిన విప్లవ బాణమా
// జయహో//

చరణం:2
ఉరి కంభం ముద్దాడిన భగత్ సింగ్ సుఖ్ దేవ్ రాజ్ గురుల త్యాగమా
సిపాయిల తిరుగు బాటు ప్రథమ స్వతంత్ర సమర బాట గీతమా
ఉద్యమ  తొలి అడుగు మంగళ్ పాండే పౌరుషమా
మరెందరో అమరుల పోరాటాల పుణ్య ఫలమా
// జయహో//

చరణం:3
ఆంగ్లేయ సైన్యాన్ని గడగడ లాడించిన  వీరవనిత ఝాన్సీ రాణి పౌరుషమా
స్వరాజ్యమే నా జన్మ హక్కని నినదించిన తిలక్ నినాదమా
వందేమాతర మన్న బంకిం చంద్ర ఉద్వేగ గీతమా
క్విట్ ఇండియా సహాయ నిరాకరణ ఉద్యమాల కెరటమా
// జయహో//

చరణం:4
చెరగని రుధిరం నేల జలియన్ వాలాబాగ్  దురంత సజీవ సాక్ష్యమా
మీసాలు మెలి తిప్పిన  అజాదు  పౌరుషమా
తుపాకీ గుండుకు గుండె ఎదురొడ్డినిలిచిన ఆంధ్ర కేసరి ప్రకాశమా
అంబేద్కర్ రాజ్యాంగం అవనిలోని కీర్తి కిరీటమా
// జయహో//

చరణం:5
వాల్మీకి రామాయణం వ్యాసుడి భారతం ఇతిహాసాల నిలయమా
వేద వేదాంగాలు విలసిల్లిన సుమ పరిమళమా 
భారతీ వడిలో ఓలలాడిన  పుణ్య నదుల ప్రవాహమా
భారతీయుల గుండెల్లో విరిసిన నవ వసంతమా
// జయహో//

(75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో)

0/Post a Comment/Comments