భారత దేశం, బంగారు దేశం - మార్గం కృష్ణమూర్తి

భారత దేశం, బంగారు దేశం - మార్గం కృష్ణమూర్తి


భారత దేశం, బంగారు దేశం

భారత దేశం ప్రపంచంలో రవి బింబంలా ప్రకాశిస్తుంది నేడు. తరతమ భేదాలు లేకుండా, కులమతాలు భాషలు, ప్రాంతాలకు భిన్నంగా భారతీయులందరూ ఐఖ్యతతో  జీవిస్తున్నారు.

గణతంత్ర దినోత్సవాలను ప్రతియేడూ ఘనంగా జరుపుకుంటూ, ఉత్సాహంగా ఉన్నారు. వనితలు ఎందరో ఉన్నత విద్యలు చదివి, ఉన్నత స్థాయిలలో పరిపాలన సాగిస్తున్నారు. తమను గుర్తించ లేదన్న భావన ఎవరిలో లేకుండా, పూర్తి స్వేచ్ఛతో ప్రజలు జీవిస్తున్నారు. రాజ్యాంగం కల్పించే భారతీయులకు, ఎన్నియో హక్కులు, అవకాశాలు, అధికారాలు. మన దేశ ఔన్నత్యం, శక్తి సామర్ధ్యాలు, కీర్తి ప్రతిష్టలు, శత్రువుల గుండెలలో రైళ్ళు పరుగెడుతున్నాయి.

కానీ యేండ్లు గడిచినా దేశంలో పేదరికం తగ్గడం లేదు, రైతుల సమస్యలు తీరడంలేదు. వ్యవసాయం, రైతు భారతదేశానికి వెన్నెముక. రైతులు కంటనీరు పెట్టకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వాలదే. కౌలు దారులను రైతులుగా గుర్తించాలి. భూస్వాములను పెట్టుబడిదారులుగా గుర్తించాలి.

ముఖ్యంగా ఎన్నికల సంస్కరణలు జరిగి, ఇప్పుడు ఉన్న బినామి చట్టాలనే అమలుచేసి, చిన్నా పెద్దా తేడాలేకుండా, ఆశ్రిత పక్షపాతం లేకుండా అవినీతి పరులకు శిక్షలు వేసి, నల్లధనాన్ని రాబట్ట గలుగుతే, ప్రపంచంలోనే భారతదేశం అభివృద్ధి చెందిన బంగారు దేశంగా గుర్తింపు పొందుతుంది.

- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్





0/Post a Comment/Comments