మువ్వన్నేల మన జెండా ---పసుల లాలయ్య

మువ్వన్నేల మన జెండా ---పసుల లాలయ్య


మువ్వన్నెల మన జెండా


మన స్వతంత్ర భారతీయ  జెండా
ఎగిరెను వీధుల నిండా
మువ్వన్నేల ముద్దుల జెండా
మురిసెను వసంతాలు నిండా
త్రివర్ణ పతాకం మన జెండా
పింగళి రూపకల్పన భారత జెండా
భరతమాత గొప్పతనం ఆ జెండా
మూడురంగుల ఆశోకచక్రపు జెండా
సమైక్య భారతావనికి అండదండ
సమరయోధుల స్వాతంత్ర్యపు జెండా
త్యాగాలకు ప్రతిరూపం మన జెండా
ఆగష్టునెల మనకి స్వాతంత్ర్య జెండా
కాంతిని నింపును ఈ జెండా పండగ
రెపరపలాడే మువ్వన్నేల ఆజెండా
అమరవీరుల త్యాగఫలం మన జెండా
విజయపతాకానికి తీపిగుర్తు మన జెండా
రణరంగంలో కదలాడిన జెండా
తెల్లదొరల విముక్తినుండి కాపాడిన ఈ జెండా
దేశప్రజల్లో ఆనందాన్నిచ్చిన ఈ జెండా
75 వసంతాల జ్ఞాపకం మన భారతీయ జెండా పండగా.
ఈ కవిత నా స్వంతంగా రాసినదని నా హామీ ఇస్తున్నాను.

పసుల లాలయ్య
అనంతపూర్ జిల్లా: వికారాబాద్ 
చరవాణి: 7893999525.

0/Post a Comment/Comments