పాకాల యశోదా రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని రాసిన కవిత "మాండలిక మహరాణి" --ఐశ్వర్య రెడ్డి గంట

పాకాల యశోదా రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని రాసిన కవిత "మాండలిక మహరాణి" --ఐశ్వర్య రెడ్డి గంట

పాకాల యశోదా రెడ్డి జయంతి

మాండలిక మహరాణి


మా ఊరి ముచ్చట్లు అంటూ 
ఎచ్చమ్మ కథలు చెప్పిన యశోదమ్మ 
తెలంగాణ యాసకు జీవంపోసి 
 నూతన ప్రయోగాల ఒరవడికి 
శ్రీకారం చుట్టిన ఎచ్చమ్మ
పుట్టిన గడ్డ పైన ఉన్న మమకారంతో 
మాండలికానికి పెద్దపీట వేసి 
మాండలిక మహారాణిగా వెలిగే యశోదమ్మ

ఉస్మానియా ఒడిలో చదువుల నేర్చి 
అధ్యాపక వృత్తిని అలంకరించి 
సాహిత్యంలో అడుగుడి కల్పన 
నామధేయం తో ఎన్నో కథలకు ప్రాణం పోసింది

ఆకాశవాణిలో అరంగేట్రం చేసి, 
ఊరబావి ముచ్చట్లు చెప్తూ 
ఎన్నో ప్రసంగాలు తనదైన శైలిలో
రక్తి కట్టించిన తరుణి
రేడియోలో పిల్లల నాటకాలను మొదలుపెట్టి ,
అధికార భాషా సంఘానికి ఏకైక 
మహిళ అధ్యక్షురాలిగా నిలబడిన విదుషీమణి 

ఎన్నో కథలు కవిత్వాలు రాసి అవార్డులు 
రివార్డులు పొందిన ఘనత మా యశమ్మ సొంతం, 
తెలంగాణ కీర్తిని రాష్ట్రాలను దేశాలను దాటి 
ప్రజ్వలింపచేసిన తెలంగాణ కీర్తి కిరీటం
పాకాల కే వన్నెతెచ్చిన పారిజాతం, 
యశోదమ్మ మీకు వందనం అభివందనం. 

పేరు : ఐశ్వర్య రెడ్డి గంట
ఊరు:హైదరాబాద్
చరవాణి:85550692650/Post a Comment/Comments