ఆదరణలేని అనాధ. పేరు: సి.శేఖర్(సియస్సార్)

ఆదరణలేని అనాధ. పేరు: సి.శేఖర్(సియస్సార్)

ఆదరణలేని అనాధ

మనభాషే కదా మన భవిత
మనభాషలోనే దాగున్నది మన చరిత
మనసుభాష కురిపించును మమత

అడుగడుగునా తోడుండి
అమ్మవలే ఆదరించు
ఆప్యాయతానురాగాలు
అందిరిలో కురిపించు

జ్ఞానానానికి దారిచూపి
విజ్ఞానం అందించి
వినయాన్ని నేర్పించి
విలవలను మదినింపి
విశ్వమంతా గెలిపించును
విజయాలను అందించును

మాతృభాషపై ప్రేమెక్కడ?
అమ్మనేర్పిన భాషకు ఆదరణేది?
పరాయిభాషనేర్చి కిరాయివాలవుతున్నరు
అమ్మనాన్నలు ఇపుడంతా
అనాధశ్రమంలో అన్నట్లు
మాతృభాషనొదిలేస్తున్నరు

ఆదరణ లేననాడు 
అంతిమసంస్కారమే మరి

హృదయ సంస్కారం కావాలంటే
నైతికతగల సమాజం బతకాలంటే
మనసును తాకే 
మాతృభాష బతకాలి
మానవత్వం వికాసించాలంటే
తెలుగుభాష బృందావనాలు వికసించాలి
మనిషి మనీషిగా పరిమళించాలి

సి. శేఖర్(సియస్సార్)
పాలమూరు,
9010480557.


0/Post a Comment/Comments