*అమ్మ భాష_తెలుగు*
శీర్షిక:*మధుర భాష*
కవిత:
దేశ భాషలందు తెలుగు లెస్స భాష
యాబై ఆరు అక్షరాల ఘనమైన భాష
అచ్చులు హల్లులు ఉభయ అక్షరాల భాష
తల్లి ఒడిలో నేర్చుకునే అమృత భాష
నన్నయ నాంది తెలుగు భాష
తిక్కన తీయని తెలుగు భాష
ఎర్రన వర్ణనము తెలుగు భాష
అష్టదిగ్గజములు అలరించిన తెలుగు భాష
అందమైన అక్షరాల నుడికారాల భాష
జాతీయాలు పొడుపు కధాసుధా భాష
పాటలు పద్యాలు నాటికిల మిలితాల భాష
ఒగ్గు కథలు తోలు బొమ్మలు యక్షగాన భాష
సొగసైన సంధులు సమాసాల భాష
అంద చందాలు ఒలికే చందస్సుల భాష
చాటువులు చమత్కారాలు నింపే భాష
శతక పురాణ ప్రబంధ కావ్యాల భాష
అజంతా సుందరిల వసంత భాష
తీయనైన కమ్మనైన తెలుగు భాష
తెలుగు తో వెలుగు అందించే భాష
తెలుగు రాష్ట్రాల మధురమైన భాష
ప్రపంచ కాంతి గా మెరిసే తెలుగు భాష
అమ్మ భాషే మనకు అమృతము
అదే మనకు తుదకు శాశ్వతము
అమ్మ భాష అంటే మాకు ఇష్టము
తేనె తేటల తెలుగే మాకు స్పష్టము
రచన: జక్కా నాగమణి
సాలూరు
..