మూడో వ్యక్తితో...ముచ్చట...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

మూడో వ్యక్తితో...ముచ్చట...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

మూడో వ్యక్తితో...ముచ్చట

ఏదో అదృశ్యశక్తి
ఆజ్ఞమేరకు పెళ్లికుదిరి
నూతన వధువు మెళ్ళో
మూడుముళ్లు‌ వేశాక
ఏడడుగులు నడిచాక
ప్రాణస్నేహితురాలంటూ...

ఆ వధువు పుట్టినింటనుండి
మెట్టినింట్లో అడుగుపెట్టాక
పాత స్నేహమంటూ
మరువలేని చిన్ననాటి
ప్రాణమిత్రుడంటూ........

కల్లో కనిపిస్తున్నారంటూ సెల్లో
ఇద్దరూ అదేపనిగా పదేపదే
మూడో వ్యక్తితో ముచ్చటలాడరాదు

మూడో వ్యక్తితో ముచ్చట ముప్పే
అది ముమ్మాటికీ తప్పే
పెడుతుందా ముచ్చట కాపురంలో నిప్పే

మదిలో అనుమానం వుంచుకోరాదు
కడుపులో కక్షను పెంచుకోరాదు
కోపంతో రెచ్చిపోయి
పిచ్చిగా పిచ్చిగా మాట్లాడుకోరాదు
పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకోరాదు

ఆవేశంలో అనరాని మాటలు అనుకోరాదు
కోపంతో తిట్టుకోరాదు జుట్టు పట్టుకోరాదు
నడిరోడ్డులో కొట్టుకోరాదు కోర్టుకెక్కరాదు
నలుగురిలో నవ్వుల పాలైపోరాదు

పదిమందిలో పరువుపోతే ఇక బ్రతుకు నరకమే!
అది గతజన్మ కర్మఫలమే !ఆ కలతలకు ఆ కలహాలకు
కారణం చిత్తచాపల్యమే! మనసులోని దౌర్బల్యమే!
ఒద్దికగా ఉన్న...భార్యాభర్తలిద్దరి జీవితం స్వర్గతుల్యమే!
కలిసివున్న...కాపురం పచ్చదనమే ! ఇల్లు ఇంద్రభవనమే!

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502


 

0/Post a Comment/Comments