ఒక చిన్న కండీషన్ ఏమిటది?...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఒక చిన్న కండీషన్ ఏమిటది?...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఒక చిన్న కండీషన్ ఏమిటది? 

తల్లీ !  ఓ సాగర మాతా‌! 
నీలో దూకి ఈ తనువు 
చాలించాలనుకుంటున్నాను

ఓకే బిడ్డా ! అలాగే కాని 
ఒక చిన్న కండీషన్ ! 
నాలో అలలు ఆగిన తర్వాత 
మాత్రమే నీవు దూకాలి

ఎంత కాలమైనా 
ఎన్ని ఏళ్ళు గడిచినా 
ఆ అలలు ఆగలేదు 
ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు

మహోన్నత మైనది
మహా ఉత్కృష్టమైనదీ 
ఈ మానవ జన్మ
అట్టి జన్మను మట్టిలో కలపడం
ఎంతటి దారుణం ! 

అజ్ఞానంలో అంధకారంలో 
దుర్వసనాలకు బానిసలై
ఆకర్షణతో అమాయకత్వంతో
క్షణికావేశాలకు గురై
బంగారు భవిష్యత్తును 
బలి తీసుకోవడం 
ఎంతటి ఘోరం ! 

కష్టపడి కని పెంచి పెద్ద చేసి
ఆశలెన్నో పెట్టుకున్న 
కలలెన్నో కంటున్న
కన్న తల్లిదండ్రులను 
మానసిక క్షోభకు గురిచేయడం 
ఎంతటి నేరం ! 

అందుకే ఓ బిడ్డలారా ! 
ఆ దారుణానికి పాల్పడే ముందు
ఒక్కసారి ఆలోచించండి !
మీకు జన్మనిచ్చి మీ అమ్మానాన్నల్ని...
మీకు ప్రాణం పోసిన ఆ భగవంతున్ని...
నిండునూరేళ్లు బ్రతికిన
మీ తాతా ముత్తాతలను... 
కోట్లు ఖర్చు పెట్టినా బ్రతుకని
కోటీశ్వరులను... 
ఒక్కసారి ఒకే ఒక్కసారి
గుర్తుచేసుకోండి ! చాలు, ఆపై
"ఆశే మా ఆస్తి" అంటారు !
"ఆత్మహత్యకు స్వస్తి" అంటారు !

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502

0/Post a Comment/Comments