అందమైన ప్రేమ కథ..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

అందమైన ప్రేమ కథ..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

అందమైన ప్రేమ కథ..!(కవిత)

అందమైన ఆకాశంలో 
అందమైన జాబిల్లి..!
నీలాకాశం ఇవాళే ఎందుకు
మెరుస్తోంది..!??
ప్రేమలో పడ్డట్టుంది..!??
ఆ తారలు కూడ ఎలా దాక్కొని మరీ జాబిల్లి-
ఆకాశముల సయ్యాట చూస్తున్నట్టున్నాయి..!?‌?
ఎందుకు ఆ చకోర పక్షి అలా మౌనంగా నున్నది..!??
ఏమిటో దాని మదిలోని మాట..!?
ఎందుకని ఆ తెల్లని,చల్లని జాబిలి వెన్నెల 
అలా చిరునవ్వుల వెలుతురు విరజిమ్ముతూ ఉందో..!??
ఆ మేఘాలు సైతం ఏదో అలజడి రేగి నట్టు.. 
ఫెళా ఫెళా పిడుగులు కురిపిస్తున్నవో..!??
ఆకాశ జాబిల్లి ప్రేమ రాగం మోహిస్తోంది , కాబోలు..!??

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,
నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.

0/Post a Comment/Comments