వజ్ర భారతం - వందే మాతరం ---మోటూరి నారాయణ రావు

వజ్ర భారతం - వందే మాతరం ---మోటూరి నారాయణ రావు



వజ్ర భారతం - వందే మాతరం 


రెండు శతాబ్ధాల నెత్తుళ్లు

పరాయి పాలన సంకెళ్ళు 

తెల్లదొరల నిశీధి  రాజ్యంలో

సాంస్కృతిక, సాంఘిక,

మాన, ప్రాణాల విధ్వంశం 

నాటి తల్లి భారతి ముఖచిత్రం 


బానిస పొరల 

పొగమంచులో

చిదిమేయబడిన 

మౌనభారతం 

కసాయి,కిరాయి 

ఏలుబడిలో 

ఊపిరి బిగబట్టి  

సాగిన జీవితం

నా తల్లి భారతి   

దీన వదనం


బానిసత్వం, 

పరపీడనత్వం

రక్తచరితలు, 

నిరసన జ్వాలలు

రోజుకో కన్నీటి 

కధనగాధలు

పూటకో తిరుగుబాటు 

బావుటాలు

చరిత్ర పుటల్లో  

చీకటి అక్షరాలు 

నా తల్లి భారతి  

మౌన రాగాలు


జలియన్ 

వాలాబాగ్ 

దురంతాలు 

సిపాయిల 

తిరుగుబాటు 

ఉదంతాలు

సహాయ 

నిరాకరణోద్యమమై

దండి సత్యాగ్రహ

నినాదమై 

సైమన్ గో బ్యాక్ 

హెచ్చరికలై

శత్రుమూకలపై 

అహింసా 

మిసైళ్లను

సంధించిన  

సున్నిత 

సమరాంగిణి

నా తల్లి భారతి  

అహింసావాదిణి


కత్తులు దుయ్యని

యుద్దాలు 

గొంతులు కోయని 

పోరాటాలు

ఎత్తుకు పై ఎత్తులేస్తూ 

ఉప్పెనలా కదలిన 

స్వాతంత్రోధ్యమ సంగ్రామం

ఉత్తుంగ తరంగమై ఎగసిన

జాతీయ త్రివర్ణ పతాకం..

నా తల్లి భారతి యుద్దరీతి


సిపాయిల తిరుగుబాటు

గాంధీజీ,సత్యాగ్రహ

దీక్షల వరకూ

అలుపెరగక 

స్వాతంత్ర్య భారతికై

ఈ నేలపై 

రుధిర ధారలు 

చిందించిన 

త్యాగధనుల బలిదానాలు 

మువన్నెల జెండాలై 

ఎర్రకోటపై ఎగురుతున్నాయ్.

వజ్ర భారతం -వందేమాతరం


రచన : మోటూరి నారాయణ రావు 

ప్రాంతం :హైదరాబాద్ 

వృత్తి : జర్నలిస్టు 

చరవాణి : 9346250304

0/Post a Comment/Comments