శీర్షిక:హరిత నీడ శ్రీమతి సత్య మొం డ్రేటి

శీర్షిక:హరిత నీడ శ్రీమతి సత్య మొం డ్రేటి


హరిత నీడ
 

ఆహ్లాదకరమైన ఉషస్సు లో విశాలమైన ఇంటి ప్రాంగణంలో వాకింగ్ చేస్తూ ఉన్నాను... ఇంటి చుట్టు రా పచ్చని తివాచీ పరిచినట్లు ఉన్న అవని మాత. పెరట్లో వంట ఇంటికి కావలసిన ఆకుకూరలు కూరగాయలు మొక్కలు... ఇంటి చుట్టు రా వృక్ష రాజములు... మామిడి వేప నేరేడు మొదలైన వృక్షాలతో ఆకుపచ్చని సిరితో మా ఇల్లు వనదేవతకు  నిలయమై విరాజిల్లుతున్నది అనడంలో అతిశయోక్తి లేదు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఉన్నందుకు వృక్ష రాజా లకు ధన్యవాదాలు చెబుతూ ప్రతిరోజు వాటికి నమస్కరించుకుంటాను...... ఈ ఆకుపచ్చని సిరి కోసం కుటుంబమంతా ఎంతో కష్టపడి మొక్కలను పెంచాం.... చాలా సంవత్సరాల క్రితం సంగతి..

ఆటల కోసం వెళ్లిన మా బాబు శ్రీధర్... ఇంటిముందు  మట్టి ని తవ్వుతూ కనిపించాడు
"శ్రీ ఏం చేస్తున్నావు..."అని అడిగాను

మేము ఆడుకునే చోట ఒక మొక్క దొరికింది అమ్మ... దాన్ని తీసుకుని వచ్చి మన ఇంటి ముందు వేస్తున్నాను అందుకే మట్టి తవ్వుతున్నాను... పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మా మాస్టారు చెప్పారు అమ్మ ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టును నాటితే మన దేశం హరితప్రదేశ్ గా కలకలలాడుతూ ఉంటుంది అన్నారు... నీకు చెప్పి నర్సరీకి వెళ్లి మొక్కలు కొందాం అనుకున్నా అనుకుంటే నాకు ఈ మొక్క ఖాళీ ప్రదేశంలో దొరికింది మమ్మా..... అంటూ ఎంతో ఆనందంగా ఆ మొక్క మీదే వాడి మనసంతా కేంద్రీకరించి మొక్కను పాతటం.లో నిమగ్నమయ్యాడు....

ఆ రోజే నా ఆకుపచ్చని సిరి కి నాంది పలికిన రోజు ... పిల్లలంతా తలా ఒక మొక్కను తీసుకొచ్చి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మొక్కలతో నింపారు. 

మొక్కలు పెరిగి పెద్దవయ్యాయి పిల్లలు పెరిగి పెద్ద అయ్యారు... మొక్కల సిరి తో పాటు సకల సిరులు పెరిగి పెద్దయ్యాయి నాకు... ఆ మొక్కలను నా పిల్లలతో పాటు ప్రేమగా చూసుకుంటూ ఉంటాను... పిల్లలకి ఆ మొక్కలే పెద్ద స్నేహితులు నా ఇంటికి పూల కోసం పళ్ళ కోసం మామిడాకుల కోసం జనం వస్తూనే ఉంటారు ఇది కూడా ఒక వరం అనుకుంటాను నేను. మా ఇంట్లో పూజకి వంటల కి నా ఇంటి లోని మొక్కలే ఆధారం.... నా ఇంటికి హరిత నిలయంగా శాశ్వత నామం.... చెట్లకింద కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంటే బ్రతుకులో ఇంకేం కావాలి అనిపిస్తుంది.... అందుకే ప్రతి వారు ఒక మొక్కను నాటి వీలైతే నేలమీద లేదంటే కుండీలలో పెంచుకొని స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని పర్యావరణాన్ని  కాపాడదాం... పిల్లలు కనపడని నీడలా
విదేశాల్లో ఉంటున్న.... ఈ వృక్షాలు నీడై  మమ్మల్ని కాపాడుతున్నాయి.. హరిత సిరి మాకు ఆరోగ్య సిరి....

వృక్షో రక్షిత రక్షితః


పేరు శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు హైదరాబాద్
చరవాణి 9 4 9 0 2 3 9 5 8 1

0/Post a Comment/Comments