శ్రీ కృష్ణ తత్వం జీవన సూత్రం --శ్రీపాల్ గ్రా: గోవింద్ పేట్ మం: ఆర్మూర్ జి : నిజామాబాద్.

శ్రీ కృష్ణ తత్వం జీవన సూత్రం --శ్రీపాల్ గ్రా: గోవింద్ పేట్ మం: ఆర్మూర్ జి : నిజామాబాద్.




శ్రీకృష్ణతత్వం జీవన సూత్రం
 
ఏ తత్వం పూర్ణత్వంమో
ఏ తత్వం జగతి మార్గదర్శనమో
ఆ తత్వమే శ్రీకృష్ణ తత్వం
మనిషిలో పూర్ణత్వాన్ని
సమాజంలో
ఆర్థిక, రాజకీయ, భావానికి, ఆధ్యాత్మిక క్రాంతిని
ఎగిరేసిన క్రాంతి వీరత్వం శ్రీకృష్ణ తత్వం...
అసమర్థతపు మనిషి
సమర్థుడిగా నిలబెట్టిన అద్వితీయ తత్వం 
శ్రీ కృష్ణ తత్వం
ప్రతి మనిషిలో సంగీత మాధుర్యాన్ని
సకల జీవరాశి పట్ల మాతృ ప్రేమను
తెలిపిన గోవర్ధన తత్వం
శ్రీకృష్ణ తత్వం మనిషి జీవన సూత్రం...
ప్రపంచానికి స్నేహాన్ని 
గోపికల రమణీయ భావాన్ని 
తెలిపిన హే ! శ్రీకృష్ణ  నీ తత్వం అజరామరం 
ఆటలలో ఆత్మ తత్వాన్ని
పూర్వ జన్మ తత్వాన్ని
శత్రువులతో సామ, వేద ,దండోపాయాలతో
వినాశన తత్వాన్ని
ఈ జగతికి గీత తత్వంతో 
ప్రతి మనిషికి 
నేను చేయగలను, నేను మారగలను
ఆశ్వాసన తత్వంతో 
మనిషిలో తేజస్వి విచారాలను తెలిపిన జీవన తత్వమే
శ్రీకృష్ణ తత్వం...

  .....శ్రీపాల్.....
8978894808

0/Post a Comment/Comments