మహాయోధ శ్రీకృష్ణ
----వి. కృష్ణవేణి
భక్తిజ్ఞానం, యోగం, మోక్షం గురించి ప్రపంచానికి తెలియచేసిన శ్రీకృష్ణతత్త్వం..
ధర్మాన్ని రక్షించడానికి..
మానవాళిని సంరక్షించడానికి
విష్ణు మూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం.
బాలకృష్ణడుగా,అల్లరిపనులు చేసిన వెన్నదొంగగా...
తల్లుల మనసులు దోచిన కన్నయ్య అల్లరి సంతోషం కల్గిగిస్తూ..
గోవర్ధనగిరిదారుడుగా,కాలియమర్దణుడుగా....
గోపికాలోలుడుగా...
అసురసంహారిగా...
గీతాప్రభోదకూడుగా...
కృష్ణుడు ప్రపంచానికి ఇచ్చిన అద్భుత సందేశం మనలను నడిపిస్తూ..
తనను ఆరాధించే వాళ్లతో అంతే ఆరాధనతో ఏకమైపోవడం..
తనను ఆరాధించే వాళ్లతో అంతే ఆరాధనతో ఏకమైపోవడం..
గోపికలను మధురభావంతో ముంచెత్తి వాళ్లను అనేక లీలల్లో ఓలలాడించడం...
అలౌకికమైన ఆనందాన్ని అందిస్తూ అంతిమంగా
మోక్షాన్ని ప్రసాధించడం..
వంటి మధురభావం కృష్ణావతారం
శ్రీ కృష్ణుడు లీలామానుష పురుషుడు.
మానవుడుగా..
థైవంగా మార్చి మార్చి తన వైభవాన్ని ప్రదర్శిస్తూ.
సుస్థిరపాలనకోసం భారతకృష్ణుడు ధీరోదాత్తుడు..
అద్భుత రాజా నితీజ్నుడుగా..
వ్యూహనిర్మాణచతురుడు..
స్ఫూర్తి ప్రదాతగా,మహానేత గా..
ధర్మజ్నుని నాయకునిగా తీర్చిదిద్దిన న్యాయ
నిర్ణత శ్రీకృష్ణుడు..
శ్రీకృష్ణుడు కారణజన్ముడు..
భోగలాలసుడుగా, నర్తకుడుగా,మహాయోధుడుగా..
ప్రేమకు ప్రతిరూపంగా శ్రీకృష్ణావతారంలో చూడవచ్చు..
శాంతా, దాస్య, వాత్సల్య , సఖ్య, మధుర భావాలను శ్రీకృష్ణుని జీవితంలో చూడవచ్చు.