శ్రీకారం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

శ్రీకారం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)


శ్రీకారం

మద్యపానం మనిషి బ్రతుకుని చేస్తోంది చిత్తు చిత్తు
మత్తు లో జీవితం అవుతుంది గమ్మత్తు
కుటుంబం తో సమాజం తో ఇక ఉండదు మనిషి పొత్తు
ఇదే మనిషి జీవితం లో అతి పెద్ద విపత్తు

ప్రభుత్వానికి లెక్కకు మించిన ఆదాయం
కూలీలా జీవనాలు మందు మత్తులో మాయం
సగటు మానవుని పతనం ఖాయం
కుటుంబ పరువు వైయుక్తికభాద్యత
మటు మాయం

మద్యపాన మహమ్మారి బానిసబతుకుకి ఒక దుర్భర బహుమతి
భార్యా పిల్లల జీవితాలు అధోగతి
భావిజీవితంలో ఉండదు పురోగతి
దీర్ఘాయుష్షు ను మరచి పోవడమే చివర సంగతి

తాగేవారి ఇంట్లో అలుబిడ్డలు కన్నీరు మున్నీరు
మద్యపానం అమ్మేవారి ఇంట్లో ధనరాసుల పన్నీరు
సప్తవ్యసనాలలో ఇది               మానవాజీవితానికి మిగులుస్తుంది రక్తకన్నీరు
మానవ రక్తసంబంధాలుకు మిగిలేది అంతులేని కన్నీరు

కాలేకడుపులు మాడేబతుకులు దర్శనమిస్తాయి
మనిషి పతనమై అకృత్యాలు అరాచకాలు పెరుగుతాయి
ఆర్థికవనరులు     పెరుగుతున్నాయని అనుకుంటున్నారే కానీ ముఖ్యమైన మానవ వనరు అదృశ్యమైపోతుంది అని గ్రహించకుంటున్నారు

కాదు ముఖ్యం చెడు ఆదాయమార్గం తెలుసుకోవాలి సన్మార్గం
ప్రభుత్వమే వెదకాలి నూతనమార్గం 
కాపాడుకోవాలి మానవ వనరులను ప్రభుత్వం
గాంధీ కలలుగనే స్వరాజ్యం రావాలంటే మద్యపాన నిషేధం అమలు చేయాలి ప్రభుత్వం

మంచిపనికి చుట్టాలి శ్రీకారం
సగటు మనిషి అందించాలి సహకారం
మందుబాబులు విడవాలి మందుపై మమకారం
అప్పుడే వస్తుంది  వసుధైక రాజ్యానికి ఆకారం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా
           9441530829



0/Post a Comment/Comments