శీర్షిక: కష్టజీవిని కాపాడుదాం!
కాలమాన పరిస్థితులు
ప్రతిక్షణం పరీక్ష పెడుతుంటే
ప్రణాళికను చిన్నభిన్నం చేస్తుంటే
తొలకరినంత కళ్ళముందే కాటేస్తున్న
ఏంచేయాలేని తోచనిస్థితిలో
నెట్టబడ్డ రైతు దీనస్థితి
అతివృష్టి అనావృష్టి కాటుకు
కాలమంతా కన్నీటిమయం
రైతుగుండె రాతిబండైతేగాదు
ఒళ్ళొంచిన కష్టం కళ్ళముందే
వరదలొచ్చి అంతా నష్టం
కాయం కొట్టుకుపోతూ
ప్రాణం పోతున్న దృష్యం
కలలు కల్లలవుతుంటే
తట్టుకునే గట్టి హృదయం
అతడికుంటుంది
కానీ...కాస్తయిన ఓదార్పు
మనుషులను నిలబెట్టిన
ఆ మంచి మనిషికి
సాదర సహాయం
అతడికో నూలుపోగే
పూటపూటకు తటపటాయించకుండా పోటీపడుతూ ఆరగించే మనం
వెన్నుముకలకు బలమౌదాం
ఏ నాయకత్వమున్న హాలికుడిని గాలికొదిలేయకుండా
అండదండలివ్వాలి
కష్టజీవిపై కరుణచూపాలి
అతడి కంటకన్నీరు
ఆకలికేకలతో
విశ్వవినాశనాశనం
ఎందుకంటే అతడెపుడు
విశ్వనరుడు
కడుపుమంటలనార్పే మనీషతడు
మట్టిని నమ్మిన కష్టజీవి రెక్కలకష్టంతో జీవనపయనం
రైతన్నలకు చేయుతనందించాలందరం
ఎందుకంటే.!
మనతోపాటు
భవిష్యత్తును బలంగా నిలిపేందుకు!!
సి. శేఖర్(సియస్సార్),
9010480557.
హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.
Post a Comment