జోహార్ టంగుటూరి జోహార్ --డా విడి రాజగోపాల్

జోహార్ టంగుటూరి జోహార్ --డా విడి రాజగోపాల్


జోహార్ టంగుటూరి  జోహార్

ప్రకాశానికి సూర్యుడు చిరునామా
అయితే మన ప్రకాశం
రాజకీయాల్లో  ప్రకాశానికి చిరునామా
ఇంటి పేరు టంగుటూరి
పెట్టి పుట్టిన సంసారం కాదు
అమ్మ గడవడానికి భోజనశాల
వారాలబ్బయిగా పోషన  వీరిది
అదృష్టం కలసి వచ్చింది
ఓ మిషన్ పాఠశాల అధ్యాపకుడు
చేయిచ్చి ఆదరించారు
ఓ ప్రయోజకుని చేశాడు
మన ప్రకాశం పంతుల్ని
వకీలుగా రాజమండ్రిలో జీవనం
చిన్నవయసుననే పురపాలక సంఘానికి  అధ్యక్షులుగా ఎన్నిక

ఆటుపై ఇంగ్లాండులో బారిస్టర్ చదువు
మదరాసు హైకోర్టులో లాయరుగా
లక్షల సంపాదన
అన్ని వదలి స్వాతంత్ర్య సమర బాట
స్వరాజ్యం పత్రిక సంపాదకుడై
ప్రజలను చైతన్య పరచాడు
సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా
ఉద్యమం జరిగేరోజులవి
బ్రిటీష్ పోలీసుల తుపాకీ గుండుకు
ఎదురెక్కి నిలచి
ఆంధ్ర కేసరి అనిపించుకున్నాడు
నెహ్రూను సైతం లెక్కచేయని నైజం
ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో
మంత్రిపదవి అలంకరించి
ఆపై  ముఖ్యమంత్రిగా ఎదిగి
ముక్కుసూటి మనస్తత్వంతో
ఎక్కువకాలం ఆపదవిలో లేడు
ఉమ్మడి మదరాసు నుండి
మనం వేరుపడ్డాం
ప్రజలతో మమేకమై
తిరుగుతూ వడదెబ్బకు బలియయ్యాడు
వీరి పేరిట ప్రకాశం బ్యారేజి
ప్రకాశం జిల్లా వెలసింది
వారి జయంతి  నేడు
స్మరిద్దాం ఓ మారు

--డా విడి రాజగోపాల్
9505690690
Gandhinagar  Hyderabad.


0/Post a Comment/Comments