నీకు నేను రక్ష నాకు నీవు రక్ష ...! _ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

నీకు నేను రక్ష నాకు నీవు రక్ష ...! _ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

 

నీకు నేను రక్ష నాకు నీవు రక్ష ...!
   _ కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

అమ్మ గర్భ గుడి లో నవ మాసాలు ఎదిగిన గువ్వలై 
బంధాలు అనుబంధాలు సిరి సిరి మువ్వ లై
అక్క చిటికెన వ్రేలు పట్టుకొని లోకాన్ని చూసిన ఉదయ భాను లై
చెల్లి చెట్టా పట్టాలతో విహంగం లా ఎగిరే  కవల కాంతు లై
అక్కా తమ్ముళ్ళ ప్రేమానురాగాల రక్త సంబంధ మై
శ్రావణ పౌర్ణమిన పుట్టింట సందడి  చేయ
వచ్చింది సోదర సోదరీ మణుల మణిహార మై రాఖీ పర్వదినం...!

అబలల  రక్షణ కై శిశుపాలుని నీచపు గుణ  తత్వాన్ని  అంతమొందించే విష్ణు చక్రమై
దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకాన్ని మట్టు పెట్టుట కై
రావణా సుర కీచక వారసుల అంతాని కై
వచ్చింది సోదర సోదరీ మణులు మణిహార మై రాఖీ పర్వదినం...!

మానవ మృగాల నుండి రక్షక కవచమై
ఆడ బిడ్డల రక్త కన్నీరు ను తూడ్చుటకై
భావి భారత రేపటి తల్లుల రక్షణ కై
వచ్చింది సోదర సోదరీ మణుల మణిహార మై రాఖీ పర్వదినం...!

పాశ్చాత్యపు విష సంస్కృతి సుడిగుండం లో
మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై 
సంస్కార హీన సమాజం లో నైతిక విలువలు నేర్పుటకు 
వచ్చింది సోదర సోదరీ మణుల మణిహారమై రాఖీ పర్వదినం...!

పెళ్ళై దూరమైన సోదరి సోదర చేతి స్పర్శ కై
రెండు హృదయాల స్పందనల ఆత్మీయ పలకరింపు కై
నీకు నేను రక్ష నాకు నీవు రక్ష యని దీవెనలిచ్చుటకై 
వచ్చింది సోదర సోదరీ మణుల మణిహారమై రాఖీ పర్వదినం...!


0/Post a Comment/Comments