తేనియల..తెలుగు..!(పాట),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

తేనియల..తెలుగు..!(పాట),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

తేనియల తెలుగు..!(పాట)
**********✍🏻విన్నర్****
పల్లవి:
తెలుగు భాష గొప్పదనం..!
తెలుగు భాష కమ్మదనం..!
తెలుగు భాష తీయదనం..!
తెలుగు భాష అమ్మతనం..!
ఎందెందు వెతికినా, 
దొరకనిదీ ఈ ధనం..!

చరణం:1
సిరులొలికించే భాషణం..!
తెలుగుభాష యాసగుణం..!
తెలుగుభాష మధురం..!
మధురాతి మధురం..!
ఎన్నెన్నో సంతోషాల మయం..!
తెలుగు భాష గీతమ్ముల మధురగళం..!
తెలుగువారికి 
సుపరిచితం..!

చరణం:2
సంస్కృతీ సంప్రదాయాలు..!
తెలుగు భాష సంబంధం..!
అందమైన జీవితం..!
తెలుగు ఇంటి గౌరవం..!
తేట తేట తెలుగుభాష..! 
తేనియల తీపితనం..! 
తెలుగు భాషీయుల 
వ్యావహారికం..!
తెలుగుభాష బ్రహ్మాండం..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments