ముద్దుల బాలలు -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

ముద్దుల బాలలు -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

ముద్దుల బాలలు
-----------------------

పూవుల వోలె  మనసులు
నగవుల రీతి సొగసులు
జాబిలమ్మ వన్నెలు
జగతిలోన బాలలు

జుంటితేనె ధారలు
తొలకరి చిరుజల్లులు
చిన్నారుల పలుకులు
పాలకడలి నురగలు

కొలనులోని కలువలు
కాగడాల కాంతులు
కొమ్మపైన ఫలములు
కరుణామయులు పిల్లలు

శుద్ధమైన తలపులు
శ్రేష్ఠమైన బుద్ధులు
భావితరపు పెద్దలు
బడికెళ్లే బాలలు

---గద్వాల సోమన్న

0/Post a Comment/Comments