నా దేశం
స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం
మన దేశ స్వాతంత్రం స్వేచ్చా వాయువుల కోసం
అమరవీరుల ఊపిరి జయకేతనమై మెరియగా
బ్రిటిష్ గుండెల్లో నిప్పురవ్వై విరియగా
స్వాతంత్ర్య భారత విజయపతాకం గర్వంతో ఎగురగా.
చెర వీడిన భారతావని సంతోషం సాక్షీగా
కులం మతం అనే తేడాలు లేక అందరూ
భరతమాత బిడ్డలై ఐకమత్యమే మహాబలమై
సాగించే పయనం నిత్యనూతన మై
సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమై
పవిత్ర జలాల సంగమమై
దేవతామూర్తులతో ప్రజ్వలిస్తున్న నా దేశం
ఘనమైన చరిత్ర కలిగిన సుందర దేశం
ఎప్పుడు మార్మోగుతుంది ప్రపంచ కీర్తీ పతాకాన
వందేమాతరమంటూ ...
వందేమాతరం వందేమాతరం
జయహో భారత్ జయ జయహో భారత్.
పేరు :ఐశ్వర్య రెడ్డి గంట
ఊరు:హైదరాబాద్