సయ్యద్ జహీర్ అహ్మద్,
కర్నూలు
చరవాణి: 9505152560
సమతుల్యమే సుభిక్షం
పర్యావరణం సమతుల్యత లోపం ప్రకృతి వైపరీత్యాలకు కారణం
మనిషి మస్తిష్కం స్వార్థ ప్రయోజనాల
భోషాణం
నదులను ఆవాసాలు నిర్మించి
ఇసుక మేటను గుత్త సొత్తు పాలు
వ్యాపార పెడధోరణులు
ల'కారాలకు వికారపడుతున్న సంపన్న వర్గాలు
ఫ్యాక్టరీలు చిమ్మే పొగలు విషవాయువులు
ఆమ్ల క్షార రసాయనాలు గాలిలో కలిసి పర్యావరణానికి తూట్లు గాక మరింకేం!
చెట్టు ప్రగతికి మెట్లు అన్న
చెట్లు అభివృద్ధికి ఆటంకమని నరికి వేత
నదీ నాగరికతకు ఆమ్ల క్షారములతో కలుషితమైన నీరు
ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు
ఓజోన్ పొరకు చిల్లులు
సూర్యుని కక్ష్య వ్యాకోచం
కిరణాలు తాకి భూతాపం ప్రజ్వలన!
వాతావరణ సమతుల్యతకు
పంచభూతాలు సమపాళ్ళలో కలిస్తే
పర్యావరణం సుభిక్షం
వృక్షాలను వేర్లతో పెకలించి
వేరొక చోట నాటుకొల్పాలి!
అప్పుడే పర్యావరణ పరిరక్షణ!!
***
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
హామీ ప