స్వాతంత్య్రం...
ప్రజాస్వామ్యంలో
స్వతంత్రత తడబడుతోంది
ప్రజాస్వామ్యం
ఆధిపత్యశక్తుల గుప్పెట్లో...
కనిపించే పేదోళ్ళను
తమ బాగోగులకు
మూలధనం చేసుకుని
పైపైకెదుగుతుంటుంది
ధనస్వామ్యం....
డెబ్బై అయిదేళ్ళొస్తేనేం
వందేళ్ళొచ్చినా
కులమత తేడాలు
ఉంటూనే ఉన్నాయి
సమానతంతా
కాగితాలపైనే
వల్లించే మాటలలోనే
పోరాడి సాధించుకున్న
ప్రజాస్వామ్యానికి
ప్రాణం పోస్తూనే ఉండాలి
కళ్ళు మూసుకుంటే
అసలే లేకుండా చేస్తాయి
దుష్ట శక్తులు
కనుకే
అప్రమత్తతా
చైతన్యమూ
శ్వాసై ధ్యాసై
అడుగుపడితే
ప్రజాస్వామ్యం
బతికి బట్టకట్టగలదు
పది కాలాలపాటు..
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
డాక్టర్..శుభశ్రీరాజన్..