సంసార సాగరం(వచనకవిత) -----డా. రామక కృష్ణమూర్తి

సంసార సాగరం(వచనకవిత) -----డా. రామక కృష్ణమూర్తి

సంసార సాగరం(వచనకవిత)
--డా. రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.నడిసంద్రంలో నడుస్తున్న
నావలా జీవితం.
ఎన్నో అనుభవాలు నేర్పిన
పాఠాలతో ప్రయాణం.
ఆటుపోటులెన్ని ఉన్నా
తప్పని బతుకుపోరాటం.
తీరం చేరేవరకు ఈదాలి
సంసారసాగరం.
ఎదురీతతో అధిగమించాలి.
కష్టసుఖాలను సమంగా చూడాలి.
నిరాశ,నిస్పృహలను దరిరానీక
ఆశ,సంకల్పాలతో ముందుకు సాగాలి.
అనంతమైన ఆనందమనే ఔషధమే తీసుకోవాలి.
చిరునవ్వుతో చింతలను,
సహనంతో బాధలను,
తమాయించుకొని సాగిపోవాలి.
సంపూర్ణ జీవనగమనానికి
ఆజ్యమే శాంతి కావాలి.


0/Post a Comment/Comments