జయహో భారత్
భరతమాత ముద్దు బిడ్డలు
సాధించిన విజయాలు
ఒలింపిక్స్ పతకాలు
క్రీడారంగంలో ఆనందోత్సవాలు
మన జాతి రత్నాలు
మరకత మాణిక్యాలు
విజయబావుట వజ్రాలు
భారతావని ముత్యాలు
జపాన్ దేశము లో
టోక్యో నగరంలో
త్రివర్ణ పతాకం
రెపరెపలు
సాధించెను నీరజ్ జావెలిన్ త్రో లో బంగారు పతకం
సాధించెను పి.వి.సింధు బ్యాట్మింటన్ లో కాంస్య పతకం
సాధించెను మన్ప్రీత్ హాకీ లో పతకం
సాధించెను దహియా రేజ్లెర్ లో రజిత పతకం
సాధించెను మీరబాయ్ వెయిట్ లిఫ్టింగ్ లో రజిత పతకం
విశ్వక్రీడలో విశ్వతేజాలు
విశ్వఖ్యాతిలో సువర్ణాలు
విశ్వమంతా సంబరాలు
వినూత్న విజయాలు భారత్ వారసులు
ఇది ఉత్సాహం
విజయోత్సాహం
భారత్ ప్రజలందరి ఉత్సాహం
భరతమాత ఆనందోత్సాహం
రచన: పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా
9441530829