జక్కా నాగమణి గారి... "సువర్ణకవచము.. జ్యేష్ఠ పౌర్ణమి.. అంతర్జాతీయ యోగ దినోత్సవం.. విశ్వజనీనము.."

జక్కా నాగమణి గారి... "సువర్ణకవచము.. జ్యేష్ఠ పౌర్ణమి.. అంతర్జాతీయ యోగ దినోత్సవం.. విశ్వజనీనము.."సువర్ణకవచం


అన్నాతమ్ముకు సోదరి కట్టే రాఖీ బంధము
ఇంద్రుని విజయముకు శచీదేవి తో ఆరంభము
మహాలక్ష్మి బలిచక్రవర్తి కట్టిన రక్షాబంధనము
శ్రీకృష్ణుడు_ద్రౌపతి కి ఇచ్చిన అభయ బంధనము
శ్రావణ పౌర్ణమితో సోదరి_సోదరుల రక్షాబంధనము

కులమతాలకు అతీతమైన బంధము
కక్ష కార్పణ్యాలు లను దూరము చేసే బంధము
కుటుంబ సంబంధాలు బలోపేతం చేసే బంధము
అక్క చెల్లెలు అందరికీ రక్షాబంధనము

దూరముగా ఉన్న భారము  కాని బంధము
సోదర_సోదరీమణుల పవిత్ర బంధము
కలిమిలేమిలో తోడు నిచ్చే అనురాగబంధము
నేనున్నానని భరోసా ఇచ్చే రక్షాబంధనము

అమ్మ,నాన్న ల పూదోటల రక్తసంబంధము
కలతలను దూరము చేసే ప్రేమ బంధము
రక్షాబంధనమై పుట్టింటికొచ్చే సోదరి బంధము
తీపితో హారతి నిచ్చి నుదిటిన తిలకధారణము

సోదర_సోదరీల జగద్రక్షా బంధనము
సోదరుని చిరంజీవ త్వానికి రక్షాకవచ బంధనము
ఆత్మీయ ఐకమత్యానికి పరస్పర సహకార బంధము
కలకాలం నిలవాలి విజయపతాక రక్షాబంధనముజ్యేష్ఠ పౌర్ణమి


వైశాఖము పోయి జేష్ఠ మాసము వచ్చే
ఆరంభమయ్యే వర్షపు జల్లుల
జల్లు చూసి కర్షక  కళ్ళలో ఆనందము
పండించడం రైతుకు జీవనాధారము
పండిన పంట మనిషికి  జీవాధారము
ఆటపాటలతో చేసే వ్యవసాయ పనులు
ఏరువాక పౌర్ణమి తో కురిసే చిరు జల్లులు
భూమి పూజ చేసి వేసే విత్తులు
జోడెడ్ల బండ్లతో సాగేను పొలం పనులు
రంగురంగులతో ఎద్దుల అలంకరణలు
మేళతాళాలతో ఊరేగింపులు
సస్యశ్యామలం అయ్యెను పంటపొలాలు
పులకరించే పుడమితల్లి పరిమళాలు
పంట చూసి వెల్లివిరిసిన ఆనందాలు
జ్యేష్ఠ పూర్ణిమ తో వచ్చే శుభ ఫలితాలు
రైతన్న క్షేమము లోకానికి ఇచ్చు 
సంక్షేమ  సుమాలు
ధాన్యపు సిరులు అందించే రైతులకు నమస్కారములుఅంతర్జాతీయ యోగ దినోత్సవం

మానవునికి యోగా పరమౌషధము
మానవునికి మానసిక వైద్య ప్రక్రియము
యోగ తో ప్రపంచాని కి ఇచ్చాము రక్ష
యోగా ఇచ్చు జనులకు సర్వ జగద్రక్ష

ధ్యానము తో ఏకాగ్రతను పెంచుము
ప్రాణాయామము తో ప్రాణవాయువును పెంచుము
కపాల భాతితో శ్వాసని నియంత్రించదము
ఊపిరితిత్తులను స్వచ్ఛము చేయుము

సూర్యనమస్కారాలతో శక్తిని పెంచుదాము
ఆసనాలను అ ణ్వ ఆయుధాలుగా వేద్దాము
యోగనిద్ర తో మానసిక విశ్రాంతి పొందుదాము
మానసిక ఒత్తిడిని మటుమాయం చేయము

శ్వాస మీద ధ్యాస తో మానసిక బలం పెంచుము
రోగనిరోధకశక్తిని అధికము చేయము
ఆత్మవిశ్వాసం మనే మందును పెంచుము
పోషక విలువల గల ఆహారం స్వీకరింపుము


ఆరోగ్యాన్నిచ్చే యోగ నిత్యము చేయము
జ్ఞానం అందించే యోగా శక్తిని చాటుము
ఆనారోగ్య అవరోధాలను ఎదిరించుము
నిత్యనూతన ఉత్సాహాన్ని పెంచుకొనుము
సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లుమువిశ్వజనీనము

చతుషష్టి కళలలో ఒక భాగము
విశ్వజనీన వ్యాపితము
సంగీతం ఒక అద్భుతము
శబ్ద కాలగమన రూపితము

ప్రకృతిలో మిళితమై సంగీతము 
శృతి రాగం తాళం పల్లవి శబ్ద లక్షణము
నిర్దిష్టతము నిబద్దతము సంగీతము
పండిత పామరులను అలరింప ము
భాగమయ్యే జీవనగమనము

జవసత్వాలను ఉత్తేజపరిచే వ్యాయామము
మనసులో కల్లోలానికి ఔషధము
మనిషి జీవితం లో అంతర్భాగము
ఆత్మ పల్లవించే రాగానందము

వెండి అలలపై నిద్రించే రాజహంస ము
మహత్తర అలల మహాసముద్రము
మదిని దోచే మనోహర ఉల్లాసము
పరిమళాల పూమొక్కల ఉద్యానవనము

మనసైన గుండెలను పలకరించే తామర ము
భగవంతుని అద్భుత ప్రసాదము
ప్రకృతి  ప్రాణుల పాడే పాటకు ప్రెరణము
అన్నమయ్య రామదాసు ల భక్తి సంగీతము
సర్వ జనులు అందించే సమాజ హితము

స రి గ మ ప ద ని స సప్తస్వరాలే మూలము
వినసొంపైన గానము ఆమోదయోగ్యము
మనిషి జీవితంలో ఓ అంతర్భాగము
పామర శ్రామికులకు ఉపశమనము

సంగీతం ఇచ్చే ప్రపంచానికి జ్ఞానము
అణువణువు కదిలిస్తూ జగతిని మేలుకొలుపుము
సప్తస్వరాల లో నవరసాలను పలికింపుము

సంగీతము
ఒక సాగరము.....
ఒక అద్భుతము..... .
అద్వితీయము.......
విశ్వజనీనము.....

సృష్టిలో సర్వ మానవుల సామాన్య భాష
హద్దులేక స్వైర విహారం చేసే శ్వాస


రచన: జక్క.నాగమణి
ఊరు: సాలూరు
జిల్లా: విజయనగరము
చరవాణి: 9492453414

0/Post a Comment/Comments