ఆశతో అర్థించా.!..భక్తితో ప్రార్థించా !... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఆశతో అర్థించా.!..భక్తితో ప్రార్థించా !... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఆశతో అర్థించా.!..భక్తితో ప్రార్థించా !

నా ఆలాచనా అక్షరాలను ఆకాశంలో
విసిరేస్తే నవ్వేనక్షత్రాలయ్యాయి

ఆ నక్షత్రాల మధ్యన
మెరిసే చంద్రున్ని అడిగా
ఇంతటి చక్కదనం నీకెక్కడిదని?

పక్కుననవ్వి ప్రక్కనున్న
సూర్యున్ని ఒక్కసారి అడగమనే

సూర్యున్ని అడిగితే సృష్టికర్త నడగమనే

సృష్టికర్తను ఆశతో అర్థించా... భక్తితో ప్రార్థించా
అందమంటే అర్థమేమని?అదెక్కడ దాక్కొని ఉందని?

ఆ దైవం నవ్వి నాచెవిలో ఇలా ఊదే
ఓ భక్తా అదెక్కడో లేదు నీవుచూసే నీచూపుల్లోనేననే

గోడపక్కన గొర్రె పిల్లను పెట్టుకొని ఊరంతావెతికినట్టు
అందంకోసం ఎందెందో వెతికిన అంధున్ని...ఔనుమరి

దుప్పటి కప్పుకున్నంతసేపే...ఏవెచ్చదమైనా

గుట్టురట్టుకానంతకాలమే...
గుప్పెట దాగినంతకాలమే.....ఏగుట్టు విలువైనా

పూజారి అనుగ్రహం ఉన్నంత కాలమే...
గుడితలుపుల్ని మూయనంతకాలమే...ఏదైవదర్శనమైనా

ఎవరికీ తెలియనంతకాలమే.....ఏ చిదంబర రహస్యమైనా

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502





 

0/Post a Comment/Comments