ప్రసంగాల దిట్ట అటల్ జీ --వి.డి. రాజగోపాల్

ప్రసంగాల దిట్ట అటల్ జీ --వి.డి. రాజగోపాల్ప్రసంగాల దిట్ట అటల్ జీ

(నేడు అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్దంతి సందర్భంగా)

నవ్వులు పండించే వాగ్దాటితో
పార్లమెంటులొ గోడలు సైతం
చెవులారా  వినంగా
నెహ్రూను సైతం ఆకట్టుకుని
పలుకు పలుకుకూ బల్లల చప్పట్లతో
కడుపుబ్బగా కడుతమాషాగా
అనర్గళంగా మాట్లాడుతూ

ఎన్నోమార్లు పార్లమెంటుకు ఎన్నికై
సొంత గూడు లేని  ఓ బ్రహ్మచారి
పేదల గూడుకై తపించిన యోధుడు
మూడు మార్లు ప్రధానిగా
విలువలకు పట్టం కట్టాడు
ప్రధాని పదవిని తృణప్రాయంగా
త్యజించిన త్యాగధనుడు

జాతీయ రహదారుల భరతం పట్టి
రయ్యుమని సాగే పయనానికి
నాంది పలికిన స్పూరద్రూపి
పటిష్ట విదేశీ విధానాలతో
ప్రపంచదేశాలను ఆకట్టుకున్న నేత
కార్గిల్ యుద్ధ విజేత మన అటల్ జీ

నేడు అటల్ జీ వర్దంతి
ఓ మారు స్మరిద్దాం
ఈ నిజాయతీకి నిలువుటద్దాన్ని
చెబుదాం జోహార్లు!

వి.డి. రాజగోపాల్
9505690690 

0/Post a Comment/Comments