తెలంగాణ పితామహుడుఅతడు...! _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

తెలంగాణ పితామహుడుఅతడు...! _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

తెలంగాణ పితామహుడుఅతడు...!
              _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

అతడు...!
తెలంగాణ చెఱువు మానస సరోవర హృదయ స్పందనల  అస్తిత్వం
అలుగు దుంకి పరవళ్ళు తొక్కే మాటల తన్మయత్వ తరంగం
తెలంగాణను స్వప్నించి శ్వాసించిన మహోపాధ్యాయ ఉషోదయం...!

అతడు...!
మంచిగా బతకలేకున్నా బిచ్చమెత్తుకోనైనా బతుకుతమని
ఆంధ్ర వాళ్ళతో కలిసి ఉండమని ఫజల్ ఆలీ తో వాదించిన కార్యవాది
ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి సారధి
నీతి, నిజాయితీ,నిరాడంబరత,నిబద్ధత,సమయపాలనల కలబోత వారధి...!

అతడు...!
పొట్ట పోసుకోవడానికి వచ్చే వారిని కడుపులో పెట్టుకొని చూడాలంటూ
పొట్ట గొట్టే వాళ్ళ మీదే మన వ్యతిరేకమన్న  కాళన్న  సూత్రాన్ని బలపరిచిన  మానవతా వాది
జీవితాంతం తన ఆశయ సాధన కోసం బ్రహ్మచారి అయిన త్యాగనిధి
సహనం, స్థిరచిత్తం,సిద్ధాంత సమ్మేళనాల సుగుణాలనిధి...!

అతడు...!
నేను జీవితంలో కన్న కల ఓకె ఒక కల
అదే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే నా కల 
అది నెరవేరి నా కల సాకారం అవుతుందన్న  ఆశావాది
మలిదశ తెలంగాణ ఉద్యమ పోరు బాట పునాది...!

అతడు...!
ఆంధ్ర వలస  పాలన పాపాల చిట్ట రాసి పెట్టిన చిత్రగుప్తుడు
అదిపత్య శక్తులపై శివమెత్తిన   శంకరుడు
తన వ్యూహాలను అమలు పరిచిన తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త
అతనే...తెలంగాణ పితామహుడు లక్ష్మీకాంతారావు,మహాలక్ష్మి ల ముద్దు బిడ్డ జయశంకర్ సారు...!

(జయశంకర్ సార్ జయంతి సందర్భంగా)

0/Post a Comment/Comments