బడి గంటలు (కైతికాలు)

బడి గంటలు (కైతికాలు)

బడి గంట చప్పుడు కోసం
ఊరంతా చూస్తూ ఉంది
బడి పిల్లల రాక కోసం
చదువుల గుడి చూస్తోంది
అదిగదిగో గడబిడ వస్తోంది
అల్లదిగో గోదారై రాబోతోంది

రెక్కలు వచ్చిన పక్షులై
సందు గొందున ఎగురుతూ
బడితలుపులు తోసుకుని
ఫిరంగిలా పరిగెడుతూ
అల్లరి పిడుగులు కురిసెను
సదువుల కోవెల మెరిసెను

రక్కసి కోరలు సాచగ
నాసిక కవచ ధారులై
గురువుల చెంత చేరగ
విరిసెనులే విజ్ఞానులై
భవితకు బాలల ఆరాటం
తప్పదు కరోనాతో సావాసం

 --కృష్ణా నాయక్, SA (తెలుగు).

0/Post a Comment/Comments