శీర్షిక:కలల సాకారమా.!
అఖండ భారతావనే లక్ష్యంగా
ప్రజాస్వామ్యమే మన శ్వాసగా
సాంస్కృతిక ఐక్యతే సాంప్రదాయంగా
సొంత ఆకాంక్షలే అజెండాగా
ప్రపంచానికే ఆశాకిరణమై నిలిచినాము..!
వైవిధ్యంతో నిండిన విలువలకై
భిన్నత్వంలో ఏకత్వమే ఆశయమై
వివేకానందుని సందేశానుసారమై
సాధికారత సాధనే ధ్యేయమై
స్వావలంబన దిశగా కదులుతున్నాము..!
యోగుల ఆధ్యాత్మిక గుబాళింపు
ఎందరో వీరుల త్యాగనిగారింపు
శాస్త్రవేత్తల ఆవిష్కరణల సింగారింపు
వ్యవసాయ స్వయంసమృద్ధి సాధింపులతో
ప్రపంచసంక్షేమమే ధ్యాసగా నడుస్తున్నాము.!
యువత ఆరోగ్యకరమైన జీవనశైలితో
సామాజిక సమైక్యతను ప్రోత్సహిస్తూ
పర్యావరణ స్పృహను పెంపొందించుకుని
ప్రజల కలల సాకారానికై కృషి చేద్ధాము
నూతన సంకల్పబలంతో సాగుదాము..!
పిల్లి.హజరత్తయ్య, శింగరాయకొండ
ఇది నా సొంత రచన