గురువు (ప్రక్రియ:సున్నితం) -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

గురువు (ప్రక్రియ:సున్నితం) -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

గురువు (ప్రక్రియ:సున్నితం)
------------------------------------
ఉదయించు సూర్యుడు  ఉపాధ్యాయుడు
సమాజాన గురువు వైతాళికుడు
అతడే విశ్వమానవ ప్రేమికుడు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

నేర్పించును ఘన నైతికవిలువలు
సరిచేస్తాడు చెడిన జీవితాలు
వివరిస్తాడు జీవిత సత్యాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

గురువే విజ్ఞాన కామధేనువు
అసువులు నిలబెట్టు ప్రాణవాయువు
త్యాగానికి చిహ్నమైన వేణువు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

నేర్పునోయ్! గురువు విద్యాబుద్ధులు
మహిలో కనిపించే ఇలవేల్పులు
జగతిలో వెలుగులీను భాస్కరులు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

గురువు నిరంతరం పూజనీయులు
మనసున గౌరవింప మహనీయులు
భువిని విజ్ఞానతరువులు గురువులు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

0/Post a Comment/Comments