'నేను..... ఒక్కడిని కాదు' ---రాజేంద్ర, ఎడిటర్, ప్రవాహిని - అంతర్జాల సాహిత్య పత్రిక

'నేను..... ఒక్కడిని కాదు' ---రాజేంద్ర, ఎడిటర్, ప్రవాహిని - అంతర్జాల సాహిత్య పత్రికనేను..... ఒక్కడిని కాదు

నేను... ఒక్కడిని కాదు
ఒంటరై పోతున్న సమాజాన్ని
ఒంటి చేత్తో మోస్తున్న శక్తిని

నేను... ఒక్కడిని కాదు
తీరం చేరక తల్లడిల్లితున్న 
భవితకు నిర్దేశమైన మార్గాన్ని

నేను... ఒక్కడిని కాదు
దారి తప్పిన ఈ లోకం పోకడను
కట్టడి చేసే కఠినమైన నియమాన్ని

నేను... ఒక్కడిని కాదు
విదిని ఎదిరించి పోరాడే
విజేతలకు స్వాధీనమైన ఆయుధాన్ని

నేను... ఒక్కడిని కాదు
హద్దులులేని దిగంతాలలో
విశ్వ మానవాళిని ఏకం చేసే సౌభాతృత్వాన్ని

నేను... ఒక్కడిని కాదు
శక్తి నేనే... మార్గం నేనే... నియమం నేనే... ఆయుధం నేనే...
కనుమరుగవుతున్న మానవత్వానికి సాక్షం నేనే

---రాజేంద్ర,
ఎడిటర్, ప్రవాహిని - అంతర్జాల సాహిత్య పత్రిక.


0/Post a Comment/Comments