నిద్రలో సైతం నీలక్ష్యాన్ని మరువకు!... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

నిద్రలో సైతం నీలక్ష్యాన్ని మరువకు!... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

నిద్రలో సైతం నీలక్ష్యాన్ని మరువకు! !

ఎవరెస్టు శిఖరం ఎక్కడం సులభం
దూకడమే అక్కడనుండి దుర్లభం
లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం సులభం
అక్కడికి చేరుకోవడమే బహుకష్టం

ఐతే తపన వుంటే
సాధన చేస్తే  సాహసం చేస్తే
ప్రయత్నంచేస్తే ప్రతిబందకాల్ని దాటేస్తే
గట్టి పట్టుదలతో గమ్యాన్ని చేరకోవచ్చు
ఏలక్ష్యసిధ్ధికైనా ఆత్మశుద్ధి తప్పక కావాలి
కొంతత్యాగం చెయ్యాలి కొత్తమార్గాల్ని కనిపెట్టాలి

నేను అగ్నిని మింగేస్తానని
నేను పర్వతాలను కదిలిస్తాని
నేను సముద్రాన్ని త్రాగేస్తానని
అడ్డంకులకు వెరవక లక్ష్యాన్ని మరువక
అకుంఠదీక్షతో గమ్యంకోసం ముందుకుసాగితే

చివరి అడుగు ఆవలితీరం వరకే
కొండంత వెలుగు నిచ్చేది గోరంతదీపమే
చిమ్మచీకటిని చీల్చుకు వచ్చేది వేకువవెలుగే
విధిని ఎదురించవచ్చు విజయశిఖరం చేరవచ్చు

గురితప్పని లక్ష్యమెంతటి కష్టమైనా సంక్లిష్టమైనా
కసితో కృషితో నిరంతర సాధనతో చేరుట సాధ్యమే
లక్షలమైళ్ళదూరమైనా ప్రారంభం ఒక్కఅడుగుతోనే
లక్ష్యసాధనంటేనే ప్రఙ్ఞను నిరూపించే మహాయజ్ఞమే

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
 

0/Post a Comment/Comments