నిన్నుకొలచేదాం --వైద్య ఉమశేషారావు లింగాపూర్, కామారెడ్డి

నిన్నుకొలచేదాం --వైద్య ఉమశేషారావు లింగాపూర్, కామారెడ్డినిన్నుకొలచేదాం

అమ్మ జగన్మాత
చర చరికారిణివి
లయ కారిణివి
స్ధితికారకివీ
వైభవంగా నిర్వహించేరు
ముత్తైదువలు వారి  పసుపు కుంకుమాలకై
ఎర్రని గాజులు
ఎర్రని చీర
ఎర్రని పూలతో బహు చక్కగా
అలంకరించి
సాయంత్రం పూట 
శక్తి కొలది పూజించి
పసుపు బొట్లు పరస్పరం
పంచుకుందురు
ప్రతిది పైసా అనే భ్రమలో
మానసిక శాంతిని సమాది చేస్తున్నారు
నిస్వార్ధం లోక కళ్యాణం
కోసం ఎన్నో రూపాలు
ఎత్తవు
లక్ష్మీ కటాక్షం ప్రతి ఇంటా
వైభవం తో నింపాలి
అష్టైశ్వర్యాలు మాకు ప్రోది చెయ్యాలి
కరోనను అంతం చేయు
మహాలక్షిమి మాత
వందనం వందనం


వైద్య ఉమశేషారావు
లింగాపూర్, కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments